: రెండో రౌండ్లో అడుగుపెట్టిన అజరెంకా
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో బెలారస్ భామ అజరెంకా రెండో రౌండ్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా టోర్నీలో అడుగుపెట్టిన అజరెంకా మొదటి రౌండ్లో స్వీడన్ క్రీడాకారిణి (91 ర్యాంక్)పై 7-6, 6-2 తో గెలుపొందింది. మొదటి సెట్లో 5-6తో వెనుకబడిన అజరెంకా తర్వాత పుంజుకుని ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఈ మ్యాచ్ గంటా 46 నిమిషాల పాటు జరిగింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలిస్తే... అజరెంకా హ్యాట్రిక్ నమోదు చేస్తుంది. ఇప్పటిదాకా మార్టినా హింగిస్ ఆస్ట్రేలియా ఓపెన్ లో హ్యాట్రిక్ సాధించింది.