: ఇంటర్ విద్యార్థినిని బెదిరించి.. బండిపై తీసుకెళ్లి అత్యాచారం


ఇద్దరు యువకులు ఇంటర్ విద్యార్థినిని బెదిరించి అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. మలక్ పేటలోని ఒక కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మొబైల్ కు గతనెల 21న మెసేజ్ వచ్చింది. మన్నెగూడ చౌరస్తా వద్దకు రావాలని.. లేకుంటే యాసిడ్ పోస్తామని.. బొంగులూరుకు చెందిన సాయి(17) మెసేజ్ పంపాడు. భయపడిన బాలిక మన్నెగూడ చౌరస్తా వద్దకు వెళ్లింది. అక్కడే వేచి ఉన్న సాయి, అతడి మిత్రుడు మణికిరణ్(18) ఆమెను బైక్ పై ఎక్కించుకున్నారు. కర్చీఫ్ తో మత్తుమందు వాసన చూపించారు. స్పృహ తప్పిన ఆమెను ఒక ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తెలివి వచ్చిన తర్వాత ఆమెను వదిలేశారు. అత్యాచారం జరిగిన సమయంలో తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండడంతో బాధితురాలు విషయాన్ని బయటపెట్టలేదు. తల్లి ఆరోగ్యం కుదుటపడ్డాక జరిగింది చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News