: సీఆర్ఫీఎఫ్ అమరులకు మా పాట అంకితం: పోలెండ్ సంగీత బృందం
పోలెండ్ కు చెందిన ఓ జాజ్ సంగీత బృందం నిన్న కాశ్మీర్ లో చోటు చేసుకున్న ఉగ్రవాదుల దాడి పట్ల చలించిపోయింది. ఆ దాడిలో మృతి చెందిన ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు తాము రూపొందించిన ఓ పాటను అంకితమిస్తున్నట్టు ఆ బృందం వెల్లడించింది.
ఆ బ్యాండ్ పేరు 'న్యూ బోన్ క్వింటెట్ బ్యాండ్'. అంతర్జాతీయ జాజ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ప్రస్తుతం ఈ గ్రూపు సభ్యులు భారత్ లోనే ఉన్నారు. మొత్తం 10 దేశాల్ల నుంచి 14 జాజ్ సంగీత బృందాలు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటాయి.