: పార్టీ గుర్తించకపోతే ఉండవల్లి డబ్బింగ్ చెప్పుకునేవారు: పొన్నం
జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లిపై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జైపాల్ రెడ్డిని విమర్శించే వారు ఆయన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోతే ఉండవల్లి డబ్బింగ్ ఆర్టిస్టుగా ఉండేవారని ఎద్దేవా చేశారు. వైయస్ కు ఆప్తమిత్రుడు కాబట్టే సోనియాగాంధీకి ఉండవల్లి అనువాదకుడయ్యారని అన్నారు. ఉండవల్లితో చర్చకు తాను సిద్ధమని చెప్పారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు రాష్ట్రపతిపై గౌరవం లేదని తెలిపారు.