: అంజిరెడ్డి మృతికి చంద్రబాబు సంతాపం
రెడ్డీస్ ల్యాబ్స్ అధిపతి డా. అంజి రెడ్డి మరణించడం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబు.. అంజి రెడ్డి మరణవార్త విన్న వెంటనే విచారం వ్యక్తం చేశారు. గత కొద్ది నెలలుగా తీవ్ర అస్వస్థులుగా ఉన్న అంజి రెడ్డి ఈ మధ్యాహ్నం కన్నుమూశారు.