: బిల్లు తగులపెట్టిన అశోక్ బాబును జైల్లో పెట్టాలి: ఎర్రబెల్లి
తెలంగాణ బిల్లు ప్రతులను తగులబెట్టిన ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బిల్లును తగులపెట్టిన అతనిపై కేసు పెట్టి జైల్లో పెట్టాలన్నారు. బిల్లును మంటల్లో దగ్దం చేయడం హేయమైన చర్య అని వరంగల్లో ఆయన మీడియాతో అన్నారు. అశోక్ బాబును నడిపిస్తున్నది ముఖ్యమంత్రేనని ఆరోపించారు. కాగా, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నామన్నారు. ఆయన మాటల్లో ఎలాంటి తప్పులేదని ఎర్రబెల్లి మద్దతు తెలిపారు.