: ఇక పొత్తుల్లేవ్ గిత్తుల్లేవ్.. ఇది చంద్ర బాబు మాట!


అవిశ్వాస తీర్మానం విషయంలో కఠిన వైఖరి అవలంబించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భవిష్యత్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదని  స్పష్టం చేశారు. గతంలో పొత్తుల ద్వారా పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన అంగీకరించారు.

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బాబు ఇరగవరం వద్ద కొవ్వూరు, ఆచంట నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అసెంబ్లీలో గందరగోళం సృష్టించాయని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలే పార్టీకి ప్రాణాధారమని చెప్పారు. కొందరు కార్యకర్తలు  ప్రాణాలు ధారపోశారనంటూ, వారి ఆత్మత్యాగాన్ని బాబు కీర్తించారు. కార్యకర్తల వల్లే ఎన్టీఆర్ కు, తనకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయని బాబు అంగీకరించారు.  

  • Loading...

More Telugu News