: బీజేపీకి 300 సీట్లు వస్తాయ్: వెంకయ్య నాయుడు


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 300 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో భాగంగా నెల్లూరు జిల్లాస్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో తాను బౌలింగ్ మాత్రమే చేస్తానని, నరేంద్ర మోడీ బ్యాటింగ్ చేస్తారని ఆయన పేర్కొన్నారు. మోడీ ఈ ఎన్నికల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం ఖాయమని ఆయన చెప్పారు. అవినీతి, కుంభకోణాలతో అంధకారంలో వున్న దేశానికి మోడీ ఆశాకిరణంలా కనిపిస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు.

  • Loading...

More Telugu News