: ఆరాధ్యనీయ వ్యక్తుల్లో సచిన్, మోడీ
తన విలక్షణ ఆటతీరుతో ఎంతో మందికి సచిన్ ఆరాధ్యుడిగా మారాడు. ప్రపంచంలో ఆరాధనీయ వ్యక్తుల్లో ఐదవ స్థానంలో నిలిచాడు. టైమ్స్ కోసం యూగోవ్ అనే సంస్థ 13 దేశాల్లో సర్వే నిర్వహించి.. 30 మంది ఆరాధ్యనీయ వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఆరాధించే వ్యక్తిగా తొలిస్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నిలిచారు. 30 మంది జాబితాలో భారత్ నుంచి ఏడుగురు ఉన్నారు. బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏడవ స్థానంలో, అమితాబ్ 9వ స్థానంలో, అబ్దుల్ కలాం 10వ స్థానంలో, అన్నా హజారే 14వ స్థానంలో, అరవింద్ కేజ్రీవాల్ 18వ స్థానంలో, రతన్ టాటా 30వ స్థానంలో ఉన్నారు.