: పీవీకి భారతరత్న ఇవ్వాలని సిఫారసు!


దివంగత ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. అలాగే, మరో ముప్పై ఆరు మందికి పద్మ పురస్కారాలు ఇవ్వాలని కూడా సిఫారసు చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్యనేత పీవీకి భారతరత్నను ఇవ్వాలని సిఫారసు చేయడం గమనార్హం. అయితే, పీవీకి భారతరత్న ఇవ్వాలని సీమాంధ్రకు చెందిన కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రతిపాదించడం వల్లే ఆయన పేరును పంపినట్లు చెబుతున్నారు. 1971-72లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పీవీ పట్టుబట్టారని అంటున్నారు. దేశ ఆర్థిక రంగాన్ని మలుపుతిప్పి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా పేరు గడించిన పీవీ మంచి తత్వవేత్త అని, రాజనీతజ్ఞుడని ప్రభుత్వం పేర్కొంది. దేశ సమగ్రతకు కృషి చేశారని, అటువంటి వ్యక్తిని భారతరత్నతో గౌరవంగా సత్కరించాలని విన్నవించింది. ఈ నెల 25న పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించనుంది.

  • Loading...

More Telugu News