: నేటి నుంచి కేజ్రీవాల్ కు 'జడ్ ప్లస్' భద్రత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నేటి నుంచి 'జడ్ ప్లస్' భద్రత అమలుకానుంది. ప్రమాదం పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరిక మేరకు యూపీఏ ప్రభుత్వం రెండు రోజుల కిందట కేజ్రీవాల్ కు భద్రతను కేటాయించింది. ఆయన నివసించే ఘజియాబాద్ ప్రాంతం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, తనకెలాంటి రక్షణ అవసరంలేదని కేజ్రీవాల్ తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే.