: ఇక యవ్వనం మీ సొంతం!


ఒక వయసు వచ్చేసరికి చర్మంపై వయసు ప్రభావం చక్కగా కనిపిస్తుంటుంది. అలాకాకుండా చర్మం చాలా కాలంపాటు యవ్వనకాంతితో మిలమిలా మెరవాలని ఎవరికి మాత్రం ఆశ ఉండదు... ఇలాంటి వారికోసమే శాస్త్రవేత్తలు ఒక సరికొత్త కృత్రిమ యాంటీ ఆక్సిడెంట్‌ను ప్రయోగశాలలో తయారుచేశారు. దీనితో మన చర్మంపై సూర్యరశ్మి ప్రభావం తగ్గుతుందని, చాలాకాలం పాటు మన చర్మం యవ్వన కాంతితో మిలమిలలాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని న్యూకేస్టిల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో టిరాన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను తయారుచేశారు.

సూర్యుడినుండి వెలువడే అతినీల లోహిత కిరణాలనుండి చర్మాన్ని రక్షించడంలో ఇది చక్కగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ మేకప్‌ సామగ్రి, అలాగే ఆహార పదార్ధాల్లో ఉండే ఇతర యాంటీ ఆక్సిడెంట్లతో శాస్త్రవేత్తలు టిరాన్‌ను పోల్చి చూశారు. సూర్యరశ్మిలోని కొన్ని యూవీ కిరణాల రేడియో ధార్మికత చర్మం లోపలి పొరలను దెబ్బతీస్తుంది, ఫలితంగా చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. దీన్ని నివారించడానికి తాము తయారుచేసిన టిరాన్‌ చక్కగా పనిచేస్తుందని, చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేయడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News