: మంత్రి పొన్నాలకు సుప్రీంలో ఎదురుదెబ్బ
రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. గతంలో సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులను పునః పరిశీలించాలని కోరుతూ పొన్నాల కొన్నిరోజుల కిందట సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం పిటిషన్ ని తిరస్కరించింది. అంతేకాకుండా గతంలో దాఖలుచేసిన రివ్యూ పిటిషన్ ను కూడా కొట్టివేసింది.