: టీబిల్లును పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతారు?: నిర్మలా సీతారామన్
టీబిల్లును పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే బీజేపీ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. మైనార్టీలపై కేసుల ఎత్తివేతకు కమిటీ వేస్తామని ప్రభుత్వం చెబుతోందని... ఇది పచ్చి అవకాశవాద రాజకీయమని విమర్శించారు. వీఐపీల సేవలో తరిస్తున్న టీటీడీ అధికారులు... సామాన్యులకు మాత్రం శఠగోపం పెడుతున్నారని మండిపడ్డారు.