: ఎంపీ సచిన్ టెండూల్కర్ గారు సభకు డుమ్మా కొట్టారు!


క్రికెట్ దేవుడు ఎవరని చిన్నపిల్లవాణ్ణి అడిగినా ఠక్కున చెప్పేస్తారు 'సచిన్ టెండూల్కర్' అని. క్రికెట్లో అనితరసాధ్యమైన రికార్డులెన్నింటినో తన పేరిట లిఖించుకున్న ఈ 'మాస్టర్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్ట్' రాజ్యసభ సభ్యుడన్న విషయం చాలామంది మర్చిపోయి ఉంటారు. గత ఏడాది రాష్ట్రపతి కోటాలో సచిన్ పెద్దల సభకు ఎంపికయ్యాడు.

అయితే, ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న సచిన్ రాజ్యసభకు డుమ్మాకొట్టాడు. బడ్జెట్ సమావేశాల ప్రథమార్థంలో ఒక్కరోజూ సచిన్ హాజరుకాలేదట. స్వయంగా రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీజే కురియన్ ఈ విషయం వెల్లడించారు. సచిన్ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 7 వరకు సెలవు కోరాడని ఆయన తెలిపారు. వన్డే క్రికెట్ నుంచి రిటైరైన సచిన్ టెస్టుల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సచిన్ ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో పాల్గొంటున్నాడు. కాగా, రాజ్యసభకు సచిన్ తో పాటే నామినేట్ అయిన బాలీవుడ్ అందాల నటి రేఖ కూడా సమావేశాలకు సరిగ్గా హాజరుకాలేదట. ఈ విషయమై సమాజ్ వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ మండి పడ్డారు. 'కొద్ది రోజులు సెలవులు మంజూరు చేసిన ఉపాధ్యక్షుడు, వారికి, శాశ్వత సెలవు ఎందుకు మంజూరు చేయకూడదు?' అని ప్రశ్నించాడు.  

  • Loading...

More Telugu News