: మాజీ భర్తను పెళ్లాడిన నటి పమేలా ఆండర్సన్
హాలీవుడ్ శృంగార తార, బేవాచ్ కథానాయకి పమేలా ఆండర్సన్ మరోసారి పెళ్లిచేసుకుంది. అయితే, కొత్తవారినేం కాదండోయ్... తన మాజీ భర్త రిక్ సాలొమన్ నే మరోసారి పెళ్లాడింది. ఈ వివరాలను లాస్ ఏంజెలెస్ లో నిన్న సాయంత్రం తనే స్వయంగా వెల్లడించింది. "మేమిద్దరం మళ్లీ పెళ్లిచేసుకున్నాం. దీంతో, ఇద్దరం సంతోషంగా ఉన్నాం. ఇద్దరి కుటుంబాలూ సంతోషంగా ఉన్నాయి" అంటూ పమేలా ఆండర్సన్ వయ్యారాలుపోయింది. 46 ఏళ్ల ఈ అమ్మడు రిక్ ను 2007 అక్టోబర్ లో పెళ్లి చేసుకుంది. అయితే కేవలం రెండు నెలల్లోనే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.