: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మహిళా కార్యకర్తల సంక్రాంతి సంబరాలు
ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు సంక్రాంతి సంబరాలను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. దీంతో టీడీపీ కార్యాలయాన్ని చక్కని రంగవల్లికలతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాలనలో పేదప్రజలు పండుగలు చేసుకోలేని దుస్థితి నెలకొందని అన్నారు. పండుగ పూట పరమాన్నం బదులు పప్పన్నం తినే పరిస్థితి వచ్చిందన్నారు. 2014 ను మహిళా నామ సంవత్సరంగా చంద్రబాబు ప్రకటించడం, రాష్ట్ర మహిళా లోకానికి శుభపరిణామమని ఆమె వ్యాఖ్యానించారు.