: చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: జేపీ
తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టి, విద్వేషాలను రెచ్చగొట్టడం... ఎవరి రాజకీయ జీవితానికైనా మాయని మచ్చగా మిగిలిపోతుందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఇలాంటి పనులు చేసేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి నిజమైన పరిష్కారాన్ని చూపించేందుకు లోక్ సత్తా తగు ప్రణాళికలు తయారుచేసిందని తెలిపారు. రాజకీయ క్రీడలో పావులుగా మారకుండా, విద్వేషాలను పక్కనబెట్టి తమ భవిష్యత్తు కోసం యువత ముందుకు రావాలని జేపీ పిలుపునిచ్చారు. కేవలం నాలుగు నెలల సమయం, వనరులు, శక్తిని యువత తనకు ఇవ్వాలని కోరారు.