: కోటిరతనాల వీణను అప్పుల వీణగా మార్చే కుట్ర జరుగుతోంది: విద్యాసాగరరావు


కోటిరతనాల వీణ తెలంగాణను అప్పుల వీణగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు ఆరోపించారు. తెలంగాణపై అప్పుల భారం మోపే కుట్ర జరుగుతోందన్నారు. 89 వేల మంది ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని... వేలాది కోట్ల ఈ భారమంతా తెలంగాణ రాష్ట్రంపై వేసే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో పుట్టబోయే ప్రతిబిడ్డ కూడా కోట్లాది రూపాయల అప్పుతో పుట్టినట్టే అని చెప్పారు. బిల్లుపై చర్చ జరగాలని, సవరణలు చేయాలని.. లేకపోతే ఇరు ప్రాంతాలు నష్టపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు ఒక ప్రత్యేకత ఉందని... అది ఏమిటంటే పాలకపక్షం, ప్రతిపక్షం రెండింటి ఆమోదంతోనే టీబిల్లు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చిందని చెప్పారు.

  • Loading...

More Telugu News