: యూపీ మంత్రి వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న నిరసన
ఉత్తరప్రదేశ్ క్రీడామంత్రి నారదరాయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. 'శిబిరాల్లో ఉన్న చిన్నారులే చనిపోతారా? ఎక్కడున్నా మరణం సహజమే'నంటూ నారదరాయ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రకటనలు చేయకుండా యూపీ సర్కారు తమ మంత్రులను కట్టడి చేయాలని కాంగ్రెస్ నేత జగదాంబికాపాల్ సూచించారు. బాధ్యతగల పదవిలో ఉండి అలా బాధ్యాతారాహిత్యంగా మాట్లాడడం సరికాదని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల వారికున్న సానుభూతి ఏంటో ఈ వ్యాఖ్యలు చూస్తే తెలుస్తోందన్నారు. మంత్రిపై యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ చర్యలు తీసుకోవాలని కోరారు. సొంత పార్టీ నేత కమల్ ఫరూఖీ సహా పలువురు నేతలు కూడా మంత్రి నారదరాయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.