: ఐపీఎల్ క్లీన్ కాదు: దాల్మియా
ఐపీఎల్ క్లీన్ (పరిశుద్ధమైనది) కాదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా అన్నారు. లెక్కతేలని ఎంతో ధనం ఐపీఎల్ లో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక వైబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఐపీఎల్ ను క్లీన్ చేయడానికి 12 సూచనలతో ప్రతిపాదనలు సూచిస్తే.. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ వాటిని పక్కన పెట్టారని ఆరోపించారు.