: సుబ్రతో రాయ్ వ్యవహారంపై సుప్రీంను ఆశ్రయించిన 'సెబీ'
సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతో రాయ్ వ్యవహారంపై 'సెబీ' ('సెకూర్యిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాయ్ విదేశీ పర్యటనకు వెళ్లకుండా ఆపాలని అభ్యర్ధిస్థూ కోర్టులో పిటిషన్ వేసింది. 'రాయ్, అతని ముగ్గురు డైరెక్టర్ల పాస్ పోర్టులను కోర్టు గౌరవ సెక్రటరీ జనరల్ కు అప్పగించాలని, న్యాయస్థానం అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లవద్దని ఆదేశించాలని' పిటిషన్ లో కోరింది.
కాగా, సెబీ పిటిషన్ పై విచారణను సుప్రీం ఏప్రిల్ మొదటి వారంలో చేపట్టనుంది. అంతకు ముందు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు తనకు, కంపెనీ ముగ్గురు డైరెక్టర్లకు పాస్ పోర్డులు ఇవ్వాలని సుబ్రతో రాయ్ న్యాయస్థానాన్ని కోరారు.