: వీహెచ్ ను రాక్షస సంతతికి చెందినవాడుగా పోల్చిన మంత్రి టీజీ
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుపై మంత్రి టీజీ వెంకటేష్ విరుచుకుపడ్డారు. ఆనాటి హనుమంతుడు గొప్ప రామ భక్తుడైతే, ఈ నాటి కలియుగ హనుమంతుడు వీహెచ్ కుప్పిగంతులు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ హనుమంతుడు దైవాంశసంభూతుడైతే, ఈ హనుమంతుడు రాక్షస జాతికి చెందిన వాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్పితే, ఆయన చేసేదేమీ లేదని విమర్శించారు. ఈ రోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కిరణ్, చంద్రబాబు, జగన్ లు ఐక్యంగా పోరాడితే రాష్ట్రాన్ని ఎవరూ విడగొట్టలేరని టీజీ అభిప్రాయపడ్డారు.