: కిరణ్ పార్టీ పెట్టడం ఖాయం: వీరశివారెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్నారు. పార్టీ గుర్తు బ్యాట్ అని కూడా తెలిపారు. కిరణ్ పార్టీ పెట్టాలనే తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీరశివారెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.