: సభ్యులు కోరితే ఓటింగ్ జరగాల్సిందే: యనమల
సభలో టీబిల్లుపై చర్చ ముగిసిన అనంతరం, సభ్యులు కోరితే ఓటింగ్ తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. రాష్ట్ర విభజన జరగాలనే దురుద్దేశంతోనే జగన్ పార్టీ చర్చను వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. బిల్లుపై చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్టే అంటూ జగన్ వ్యాఖ్యానించడం, అతని అవగాహనారాహిత్యాన్ని సూచిస్తోందని అన్నారు. ఈ రోజు హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు ఓటేస్తే సోనియాకు వేసినట్టే అన్న విషయం ప్రజలందరికీ అర్థమయిందని చెప్పారు.