: అయ్య బాబోయ్.. అంతమంది సూర్యుళ్లా..!


వేసవి ప్రభాత వేళల్లో ఆహ్లాదకరంగా కనిపించే సూర్యుడు మధ్యాహ్నానికి చిరాకెత్తిస్తాడు. ఒక సూర్యుడి ప్రభావానికే మనం ఇంత ఇదై పోతే.. నలభై లక్షల కోట్ల సూర్యుళ్ల ప్రతాపానికి ఏమై పోతామో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ! ప్రస్తుతం మన భూమండలం ఉన్న పాలపుంతకు ఆవల.. కోట్ల కాంతి సంవత్సరాల సుదూరంలో ఓ భయంకర పాలపుంత ఉందిట.

దాంట్లో జరిగే వివిధ చర్యలకు ప్రతిగా ఏడాదికి వెయ్యి సూర్యుళ్లు తయారవుతారు. 'వామ్మోయ్.. ఇంతమంది సూర్యుళ్లా.. భూమికి ఏమన్నా అయితే..?' అనే సందేహం వద్దని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఆ భయంకర పాలపుంత అవనికి 12.7 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందిట. కాగా, మన పాలపుంత ఏడాదికి ఒక్క సూర్యుణ్ణి మాత్రమే ఉత్పత్పి చేస్తుంది.

ఈ విషయాలన్నీ ఇప్పుడెలా వెలుగులోకి వచ్చాయంటే.. ఇటీవలే ఖగోళ పరిశోధకులు చిలీలోని అటకామా ఎడారిలో అల్మా అనే రేడియో టెలిస్కోప్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దది, శక్తిమంతమైనది అయిన అల్మా ఖగోళానికి చెందిన ఈ గుట్టుమట్లన్నీ విప్పడంతో శాస్త్రవేత్తలు వాటిని క్రోడీకరించే పనిలోపడ్డారు. 

  • Loading...

More Telugu News