: దేవయానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయెచ్చు: అమెరికా


భారత దౌత్యవేత్త దేవయాని విషయంలో వివాదం సమసిపోలేదు. ఆమెను ఉపసంహరించుకోవాలని అమెరికా కోరడంతో.. ఆ వెంటనే దేవయాని భారత్ కు తిరిగొచ్చేశారు. ప్రతిగా భారత్ కూడా ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ నుంచి అదే స్థాయిగల దౌత్యాధికారిని ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, వీసా మోసం కేసులో భారత దౌత్యవేత్త దేవయానిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయవచ్చని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. ఆమెకి ఉన్న దౌత్య రక్షణ కొనసాగకపోవచ్చన్నారు. అమెరికా నుంచి వెళ్లినా దేవయానిపై అభియోగాలు అలాగే ఉంటాయని చెప్పారు. తిరిగి అమెరికాలో అడుగుపెట్టడానికి అనుమతించబోమని దేవయానితోపాటు, భారత ప్రభుత్వానికి తెలియజేశామని జెన్ సాకి తెలిపారు. ఒకవేళ ఆమె అమెరికాకు వస్తే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News