: తిరుమలలో క్యూ కట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు ప్రముఖుల తాకిడి ఎక్కువైంది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు, ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ లు క్యూ కట్టారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పార్థసారధి, దానం నాగేందర్, ఏరాసు ప్రతాపరెడ్డి, బొత్స సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్, కొండ్రు మురళి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి తదితరులు తిరుమలకు వచ్చారు. వీరితో పాటు 32 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు తిరుమలలోనే ఉన్నారు. వీరేకాక పన్నెండు మంది ఐపీఎస్ లు, పదిమంది ఐఏఎస్ లు దర్శనానికి విచ్చేశారు. ఇంకా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పాండిచ్చేరికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా భారీ సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు.