: ఓటర్ల జాబితాలో వినాయకుడికీ చోటు!


ఓటరు గుర్తింపు కార్డు లభించాలంటే ఎంత పెద్ద ప్రహసనమో తెలియంది కాదు. కొత్త కార్డు తీసుకోవాలంటే..  ప్రభుత్వం వారు ఎప్పుడో ఓసారి నిర్వహించే ఓటరు కార్డు మేళాకు వెళ్లి.. చాంతాడంత క్యూల్లో నిలబడి.. ఎప్పటికో ఆ తంతు పూర్తయిందనిపిస్తాం. ఇదంతా సామాన్యుల కథ!.

అయితే, ఇవేవీ అవసరం లేకుండానే విఘ్న హరుడు వినాయకుడికి అతి సులువుగా ఓటరు గుర్తింపు కార్డు జారీ చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మద్దూరులో చోటు చేసుకుంది. ఎవరో, ఏమిటో తెలియకుండా, ధ్రువీకరణ పత్రాలు సరిగా ఉన్నాయో లేవో నిర్ధారించుకోకుండా లార్డ్ గణేశ్ పేరిట ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేశారు.

అంతేనా, కార్డుపై ఫొటో స్థానంలో వినాయకుడి బొమ్మ, తండ్రి పేరు వద్ద శివ అని ముద్రించి నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు. అయితే, ఓటరు కార్డుల జారీ ప్రైవేటు ఏజన్సీలకు అప్పగించడంతో ఎవరో తుంటరి ఈ పని చేసి ఉంటాడని సదరు అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News