: అఫ్జల్ పై పాక్ అసెంబ్లీ తీర్మానాన్ని ఖండించిన లోక్ సభ


పార్లమెంటు దాడి నిందితుడు అఫ్జల్ గురు మరణ శిక్షపై పాకిస్థాన్ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని లోక్ సభ ఖండించింది. దీనిపై స్పీకర్ మీరాకుమార్ 'పూర్తిగా తిరస్కరిస్తున్నాము' అని తీర్మానాన్ని సభలో ఆమోదించారు. ఈ సందర్భంగా తీర్మానాన్ని చదవిన స్పీకర్.. 'జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఎప్పుడూ భారత్ లో ఓ భాగమే' అన్నారు. కాగా, ఈ తీర్మానాన్ని అన్ని పార్టీల సభ్యులు హర్షధ్వానాలు, చప్పట్ల మధ్య స్వాగతించారు.

అంతకుముందు
పాక్ తీర్మానంపై ప్రతిపక్షాలు, స్వపక్ష సభ్యుల ఆగ్రహంతో సభ దద్ధరిల్లింది. దీంతో బీజేపీ నేత యశ్వంత్ సిన్హా చర్చ చేపట్టాలని కోరుతూ స్పీకర్ కు నోటీసు ఇచ్చారు. పాక్ తీర్మానాన్ని ఖండిస్తూ తీర్మానం చేయాలని డిమాండు చేశారు.

  • Loading...

More Telugu News