: ముంబయి విమానాశ్రయంలో టీ2 టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని
ప్రధాని మన్మోహన్ సింగ్ ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో టీ2 టెర్మినల్ ను ప్రారంభించారు. పురివిప్పిన నెమలి ఆకారంలో ఉన్న ఈ టెర్మినల్ ను 13 ఎకరాల్లో అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ విమానాశ్రయం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రెండువేల ఎకరాలు భూమి కేటాయించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా టెర్మినల్ నిర్మాణం జరిగినట్లు చెబుతున్నారు.