: కేజ్రీవాల్ కు తెలియకుండానే భద్రత కల్పిస్తున్నాం: షిండే


భద్రతా సంస్థలు కేజ్రీవాల్ కు భద్రత కల్పిస్తామని మూడు సార్లు కోరగా, ఆయన రెండు సార్లు వ్యతిరేకించారని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే తెలిపారు. అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు తమ పని తాము చేసుకునిపోతున్నారని చెప్పారు. ఆయన నివాసం, కార్యాలయం వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ఘజియాబాద్ ఎస్పీని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశించారని తెలిపారు. వీఐపీలకు, ప్రమాదంలో ఉన్నవారికి భద్రతను కేటాయించడం ప్రభుత్వ విధి అని, అందుకే కేంద్ర హోంశాఖ ఇలా చేస్తోందని చెప్పారు. కేజ్రీవాల్ సీఎం అయిన వెంటనే ఆయనకు భద్రత కల్పించడం మొదలైందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News