: కొత్త పోప్.. చైన్ స్మోకరట..!


తీవ్ర ఉత్కంఠ నడుమ కొత్త పోప్ గా  ఎన్నికైన అర్జెంటీనా కార్డినల్ మారియో బెరాగ్లియో (76) చైన్ స్మోకరట! అయితే, ఆ అలవాటుకు చిన్నతనంలోనే స్వస్తి చెప్పాడండోయ్. విద్యార్థి దశలో విపరీతంగా సిగరెట్లు ఊదిపారేసిన బెరాగ్లియో ఆ తర్వాత అనారోగ్యం కారణంగా ధూమపానానికి గుడ్ బై చెప్పేశాడు. ఎంత, ఎక్కువగా సిగరెట్లు తాగేవాడంటే, చివరికి రెండు ఊపిరితిత్తుల్లో ఓ దాన్ని తొలగించాల్సి వచ్చిందట.

ఈ విషయాలన్నీ బెరాగ్లియో స్వస్థలానికి చెందిన ఓ పాస్టర్ వెల్లడించారు. ఓ రైల్వే కార్మికుడి కుమారుడైన బెరాగ్లియో బాల్యం నుంచే పరిణతి కనబర్చేవాడని ఆయన తెలిపారు. ఆడంబరాలకు దూరంగా ఉండేవాడట. పోప్ ఎన్నిక సందర్భంగా వాటికన్ హోటల్లో బస చేసినపుడు బెరాగ్లియో తన బిల్లు తానే చెల్లించి, లగేజీని స్వయంగా మోసుకువెళ్లడమే అందుకు నిదర్శనం. 

  • Loading...

More Telugu News