: తెలుగువాడు ప్రధాని కావాలనే పీవీపై పోటీ కూడా పెట్టలేదు: చంద్రబాబు
ఈ రోజు శాసనసభలో ఊహించని విధంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై చర్చ జరిగింది. తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ పీవీని సీమాంధ్ర ప్రాంతం నుంచి ఎంపీగా గెలిపించామని సీఎం కిరణ్ అన్నారు. దీనిపై చంద్రబాబు కూడా స్పందించారు. తెలుగువాడు ప్రధాని కావాలని, నంద్యాలలో పీవీపై తాము పోటీ కూడా పెట్టలేదని గుర్తు చేశారు. ఆరు నెలలు పనిచేసిన వారికి కూడా ఢిల్లీలో ఘాట్ లు ఉంటే... పీవీకి లేకపోవడం దారుణమని అన్నారు. పీవీ చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు కూడా తీసుకెళ్లలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.