: శాసనసభలో గాదె చొక్కా పట్టుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
శాసనసభలో ఈటెల, ద్రోణంరాజు శ్రీనివాస్ ల మధ్య వాగ్వాదం జరుగుతున్నప్పుడు హఠాత్తుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ద్రోణంరాజు వద్దకు దూసుకెళ్లారు. దీంతో గుంటూరు జిల్లా బాపట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఊహించని విధంగా విద్యాసాగర్ రావు... గాదె చొక్కా పట్టుకున్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.