: ప్రియుడి విషయంలో కేజ్రీవాల్ సాయం కోరిన యువతి
సామాన్యుడి ముఖ్యమంత్రి కదా.. 'ఏ సమస్యనైనా' పరిష్కారిస్తారనుకోవడం సరికాదన్నట్లుగా.. కేజ్రీవాల్ ఒక ఘటనను మీడియా సమావేశంలో చెప్పారు. "ఒక యువతి నా దగ్గరకు వచ్చింది. నా బోయ్ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో నేను ఏమీ చేయలేనని చెప్పా' అంటూ కేజ్రీవాల్ వెల్లడించారు. అలాంటి అంశాలు ప్రభుత్వ సమస్యల నివారణ కార్యక్రమం పరిధిలోకి రావని ఆయన స్పష్టం చేశారు.