: చొక్కాలు పట్టుకోవడం ఏ సంస్కృతి..నెహ్రూ మీతో ఎప్పుడు మాట్లాడారు?: శైలజానాథ్


శాసనసభలో ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించడం తప్పుకాదని, అభిప్రాయాలు చెబుతున్నామనే పేరుతో శాసనసభ్యుల టేబుల్ దగ్గరకు వెళ్లి చొక్కాలు పట్టుకోవడం సరికాదని మంత్రి శైలజానాథ్ తెలిపారు. శాసనసభ్యులు గౌరవంగా ప్రవర్తించాలని ఆయన సూచించారు. బలప్రదర్శన చేయొద్దని ఆయన సూచించారు. తెలంగాణ శాసనసభ్యులు టేబుల్ దగ్గరకు వచ్చి సభ్యులను బెదిరించడం, ఘర్షణకు దిగడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

తమ ప్రవర్తనకు టీఆర్ఎస్ నేతలు క్షమాపణలు చెబితే మంచిదని.. లేకుంటే శాసనసభ్యుల భద్రత స్పీకర్ పరిధిలోనిది కనుక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈటెల మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పేరులో తెలంగాణ పేరును ఆంధ్రులే తొలగించారని అన్నారని, అది చారిత్రక అవాస్తవమని చెప్పారు. అప్పుడు జరిగిన చర్చల వివరాలను ఆయన వివరిస్తూ తెలంగాణ నేతలే ఆంధ్రప్రదేశ్ అని సూచించారని ఆయన అన్నారు. అలాగే నెహ్రూ వీరితో ఎప్పుడు మాట్లాడారో ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News