: బిల్లులో 4,928 సవరణలు ప్రతిపాదించిన సీమాంధ్ర టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఒక్కో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యే 108 సవరణలు ప్రతిపాదిస్తూ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు తీర్మానం ఇచ్చారు. రాష్ట్ర సమగ్రతను దెబ్బ తీసే విధంగా అనేక క్లాజులు ఉన్నాయని, అలాంటి ప్రతి క్లాజును తాము తీవ్రంగా వ్యతరేకిస్తున్నామని వారిచ్చిన తీర్మానంలో పేర్కొన్నారు. ముసాయిదా బిల్లు భాషాప్రయుక్త రాష్ట్రాల స్పూర్తికి విరుద్ధంగా ఉందని, అది తెలుగు ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుందని సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలంతా కలసి బిల్లులో మొత్తం 4,928 సవరణలను సూచిస్తూ సంతకాలు చేశారు. అయితే దీనిని స్పీకర్ తిరస్కరించినట్టు సమాచారం. నిన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు 9 సవరణలు ప్రతిపాదిస్తూ స్పీకర్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.