: గుండె అద్దమే.. అయినా అతుకుతుంది...


'గుండె అద్దంలాంటిది ప్రియతమా.. ఒకసారి పగిలిందంటే.. అది మళ్లీ అతకదు...' లాంటి ప్రేమ సినిమాల్లోని భారమైన డైలాగుల్ని సినిమాలు పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా కొన్ని వేల సార్లు మనం విని ఉంటాం. చార తెలియకుండా అద్దం అతుక్కోవడం మాత్రం అసాధ్యం. కానీ, పనితీరులో ఏమాత్రం తేడా లేకుండా గుండె అతుక్కోవడం కష్టమేమీ కాదని శాస్త్రవేత్తలు నిరూపించేశారు. గుండెకు పుట్టుకతో ఉండే రంధ్రాలు ఇతర ఇబ్బందులను తొలగించడానికి, ఈ జిగురు మహాద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బోస్టన్‌ పిల్లల ఆస్పత్రి, బ్రైగమ్‌ మహిళా ఆస్పత్రి, మసాచుసెట్స్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సంస్థలకు చెందిన పరిశోధకులు కలిసి ఈ జిగురును రూపొందించారు. పుట్టుకతో ఉన్న గుండెరంధ్రాలను ఇది మూసేస్తుందని.. ఒకవైపు గుండె కొట్టుకుంటూ ఉండగానే... చాలా వేగంగా పనిచేస్తూ రంధ్రాన్ని మూసేస్తుందని, గుండె వేగం పెరిగినా, బీపీ పెరిగినా దీంతో ఇబ్బంది ఉండదని.. శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జిగురు కుట్టు లాగా గుండె కణజాలానికి అతుక్కుపోయి పనిచేస్తుందట.

  • Loading...

More Telugu News