: సీఎం వ్యాఖ్యలపై భగ్గుమన్న టీఆర్ఎస్


తెలంగాణపై సభలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయి. హరీష్ మాటల నేపథ్యంలో 'ఒక్క రూపాయి కూడా మీ ప్రాంతానికి ఇచ్చేదిలేద'ని హెచ్చరిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని హరీష్ అన్నారు.

రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పి, ఇప్పుడిలా మాట్లాడటం సబబు కాదని ఈటెల ఖండించారు. తెలంగాణ ప్రజల సొమ్ముపై బతుకుతున్నారని ఘాటుగా అన్నారు. 'మా రాష్ట్రం మాకిస్తే మా బిడ్డలకు మేమే చదువులు చెప్పుకుంటా'మన్నారు. అయితే వెంటనే సమాధానం ఇచ్చిన సీఎం కిరణ్.. ఒక్క హరీశ్ రావు గురించే మాట్లాడానన్నారు. ఒకవేళ బాధపడి ఉంటే తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని తెలిపారు.

  • Loading...

More Telugu News