: అమెరికన్లకు కొంచెం ఉపశమనం


మంచుతుపాను, అతిశీతల గాలులతో వణికిపోతున్న అమెరికన్లకు కొంచెం ఉపశమనం కలిగింది. బుధవారం తూర్పు అమెరికాలోని ప్రాంతాల్లో శీతల గాలులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 37 డిగ్రీలకు పడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం మీద 21 మంది మరణించారు. ఐదుగురు గోడలమీద పేరుకున్న మంచు కూలి పడడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. 50 రాష్ట్రాలూ చలికి వణికిపోతున్నాయి. బుధవారం ధ్రువపు ప్రాంతం నుంచి వచ్చే శీతల గాలులు కొంచెం తగ్గినందున రానున్న రోజుల్లో పరిస్థితులు కుదుటపడతాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News