: మేము మాట్లాడినప్పుడు మీరు అడ్డుకోవద్దు: సీఎం
విభజన ముసాయిదా బిల్లుపై మంత్రి వట్టి వసంతకుమార్ సభలో మాట్లాడుతున్నప్పుడు మిగతా సభ్యులు ఆందోళన చేయడంతో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలుగచేసుకుని వారించారు. 'మేము మాట్లాడినప్పుడు మీరు అడ్డుకోవద్దు. అలాగే మీరు మాట్లాడినప్పుడు మేము అడ్డుకోం' అని చెప్పారు. సభలో సున్నితమైన చర్చ జరుగుతోందని.. అభ్యంతరాలు చెప్పవద్దని సూచించారు. తొమ్మిది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని సభ్యులకు గుర్తు చేశారు. కాబట్టి, రెచ్చగొట్టే విధానం మానుకోవాలని సీఎం సూచించారు.