: టీబిల్లులో 9 సవరణలు ప్రతిపాదించిన టీఎమ్మెల్యేలు


శాసనసభలో చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొనడంతో తెలంగాణ ప్రాంత నేతలు బిల్లుపై తమ అభిప్రాయాలను స్పీకర్ కు లిఖితపూర్వకంగా తెలపాలని నిర్ణయించారు. ఈ లేఖలో తెలంగాణ బిల్లులో 9 సవరణలు సూచించారు. ఎనిమిదో క్లాజ్ లో పేర్కొన్న గవర్నర్ పాలన, 30 నుంచి 40వ క్లాజ్ వరకు పేర్కొన్న రెండు రాష్ట్రాలకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు, పెన్షన్ల కేటాయింపు, ఉద్యోగుల విభజన, స్థానిక ప్రాతిపదికన నియామకాలు జరగాలనే సవరణ, యూపీ, ఎంపీ, బీహార్ లకు జరిగినట్టే ఆస్తులు, అప్పుల పంపిణీ చేయాలని కోరడం, తెలంగాణ ప్రాంతానికి ఎయిమ్స్, వెటర్నరీ వర్సిటీ, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సవరణలను ప్రతిపాదించారు. ఈ ప్రకారం స్పీకర్ కు తెలంగాణ ప్రాంత నేతలంతా లిఖితపూర్వక అభిప్రాయాన్ని అందజేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News