: డిసెంబర్లో తగ్గిన కార్ల విక్రయాలు


దేశీయంగా కార్ల విక్రయాలు గత డిసెంబర్ నెలలో 4.52 శాతం తగ్గాయి. 2012 డిసెంబర్ లో 1,38,835 కార్లు అమ్ముడవగా.. 2013 డిసెంబర్ నెలలో ఇవి 1,32,561గా ఉన్నాయి. అన్ని రకాల మోటారు ద్విచక్ర వాహనాల అమ్మకాలు 2.32 శాతం పెరిగి 11,63,465కు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల విషయానికి వస్తే మాత్రం అంతకుముందు ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే.. గత డిసెంబర్ లో 62,786 నుంచి 46,757కు తగ్గిపోయాయి.

  • Loading...

More Telugu News