: గేట్ పరీక్షలో రాష్ట్రం నుంచి 22476 మంది ఉత్తీర్ణత
దేశవ్యాప్తంగా ఎంటెక్ కోర్సులలో ప్రవేశాలకు ఉద్దేశించిన గేట్-2013 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. రాష్ట్రం నుంచి 22476 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 9,84,855 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 1,36,699 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 13.88గా నమోదైంది.