: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు: లగడపాటి
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనివ్వబట్టే సహకార ఎన్నికల్లో విజయాన్ని అందించారని పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. అందుకే తెలంగాణలోని 8 జిల్లాల్లో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం వచ్చిందని చెప్పారు. ఆంధ్రా, రాయలసీమలను చూసుకుంటే, తెలంగాణలోనే కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన లగడపాటి, సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మొదటి, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయనీ ... అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వంద స్థానాలు వస్తాయని టీఆర్ఎస్ మొదటి నుంచీ చెబుతున్నట్టుగా వారికి ఆ వంద స్థానాలు సహకార ఎన్నికల్లో వచ్చాయని లగడపాటి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.