: శ్రీవారి సన్నిధిలో ఆర్మీ చీఫ్
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఆర్మీ చీఫ్ విజయ్ కుమార్ సింగ్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలసి ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అంతకు ముందు తిరుమల చేరుకున్న ఆర్మీ చీఫ్ కు తితిదే జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దర్శనానంతరం ఆయనకు తీర్థప్రసాదాలను అందజేశారు.