: అంటుకుని అంతం చేస్తాయి


క్యాన్సర్‌ వ్యాధిని అంతం చేయడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త చికిత్సను రూపొందించారు. ఇందుకు వీరు సరికొత్త నానో రేణువులను రూపొందించారు. కార్నెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు శరీరంలోని క్యాన్సర్‌ కణాలను చంపడానికి ఒక కొత్త చికిత్సను అభివృద్ధి చేశారు. వీరు క్యాన్సర్‌ కణాలను చంపే ట్రయల్‌ అనే ప్రోటీన్‌తోబాటు మరికొన్ని ప్రోటీన్లను కూడా నానో రేణువులకు అతికించడంలో విజయం సాధించారు. ఈ నానో రేణువులను రక్తంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అవి తెల్లరక్తకణాలకు అంటుకుని ఉండిపోతాయి. అలాగే శరీరంలోని ఇతర భాగాలనుండి వచ్చే క్యాన్సర్‌ కణాలు తెల్లరక్త కణాలను తాకగానే ఈ నానో రేణువులు ఆ క్యాన్సర్‌ కణాలను చంపేస్తాయి. తాము నిర్వహించిన పరిశోధనల్లో ఈ నానో రేణువులను రక్తంలోకి ప్రవేశపెట్టి చూడగా అవి చక్కగా పనిచేస్తున్నట్టు తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News