: మేం ఎంత వ్యతిరేకించినా బిల్లు అసెంబ్లీకి వచ్చింది: సీఎం
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలంతా ఎంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వచ్చిందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ముసాయిదాపై అసెంబ్లీలో, శాసన మండలిలో తమ అభిప్రాయాలు వెల్లడించాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని తెలిపారు. అధిష్ఠానం కోరిక మేరకు ప్రజల అభీష్టాన్ని చెప్పే అవకాశం ప్రతి శాసనసభ్యుడి మీదా ఉందని ఆయన గుర్తుచేశారు. శాసన సభలో ప్రతిసభ్యుడు చెప్పే అభిప్రాయం పరిగణనలోకి తీసుకుంటారని సీఎం అన్నారు. విభజన ముసాయిదా బిల్లు తిరగరాసే విధంగా తమ అభిప్రాయాలు చెప్పాల్సిన అవసరం ప్రతి శాసనసభ్యుడి మీదా ఉందని, అది గుర్తించాలని టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలకు సీఎం సూచించారు.