: సమైక్యం మా నినాదం కాదు, మా విధానం: సీఎం కిరణ్


సమైక్యం తమ నినాదం కాదని, అది తమ విధానమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించిందని తెలిపారు. కానీ జాతీయ పార్టీగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తమ పార్టీపై ఒత్తిడి అధికంగా ఉందని అన్నారు. అయినప్పటికీ అధిష్ఠానం నిర్ణయాన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకించామని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నప్పటికీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం ఏకతాటిపై నిలబడి అధిష్ఠానాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని చెప్పారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా తమ భవిష్యత్ ను ఫణంగా పెట్టి పోరాడుతున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News